అక్షరటుడే, వెబ్​డెస్క్​: విద్యుత్​ రంగంలో అనేక సంస్కరణలు తీసుకురానున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్​ తెలిపారు. అంతర్రాష్ట్ర విద్యుత్​ పంపిణీ కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తామని ప్రకటించారు. వికసిత్​ భారత్​ కోసం న్యూక్లియర్​ ఎనర్జీ మిషన్​ తీసుకు వస్తామన్నారు. దీనికోసం అణుశక్తి చట్టానికి సవరణ చేసి ప్రైవేట్​ రంగానికి అవకాశం కల్పిస్తామన్నారు. అలాగే జల జీవన్​ మిషన్​ను 2028 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. దీనికింద ఇంటింటికి మంచినీరు అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.