అక్షరటుడే, వెబ్‌డెస్క్ : జార్ఖండ్‌లో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. బీజేపీ ఇప్పటికే ‘సంకల్ప పత్ర’పేరుతో మేనిఫెస్టోను ప్రకటించింది. కేంద్రమంత్రి అమిత్‌షా బరకట్టా, సిమారియాల్లో నిర్వహించిన ప్రచార సభల్లో పాల్గొని హేమంత్ సర్కారుపై విమర్శలు చేశారు. మహిళలను వేధించే చొరబాటుదారులను తలకిందులుగా వేలాడదీస్తామని హెచ్చరించారు. జేఎంఎం ప్రభుత్వం తప్పుడు విధానాలతో ఎక్సైజ్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌లో 17 మంది ప్రాణాలు కోల్పోయారని వ్యాఖ్యనించారు. నక్సలిజానికి కొందరు ఆజ్యం పోస్తున్నారని ఆరోపిస్తూ.. 2026 మార్చినాటికి ఈ సమస్యను నిర్మూలిస్తామని స్పష్టం చేశారు.