అక్షరటుడే, వెబ్‌డెస్క్: లోక్ సభలో మంగళవారం కేంద్రమంత్రి అర్జున్‌రామ్ మేఘ్ వాలే జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టనున్నారు. అనంతరం చర్చకోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపనున్నారు. అయితే బిల్లు ఆమోదానికి 361 మంది ఎంపీల మద్దతు కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎన్డీఏ కూటమికి 293, విపక్ష ఇండియా కూటమికి 235 ఎంపీల బలం ఉంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు, లోక్ సభకు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలను నిర్వహించడమే జమిలి ఎన్నికల ఉద్దేశం.