అక్షరటుడే, వెబ్​డెస్క్​: కాంగ్రెస్​ ప్రభుత్వం ఎల్​ఆర్​ఎస్​ అమలు చేయడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ‘ఎక్స్​’ పోస్ట్​ చేశారు. ఎల్​ఆర్​ఎస్​ పేరిట ప్రజల నుంచి రూ.50 వేల కోట్లు దోచుకోవడానికి ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. గతంలో బీఆర్​ఎస్​ ఈ స్కీం తెచ్చినప్పుడు కాంగ్రెస్​ నాయకులు వ్యతిరేకించారని ఆయన గుర్తు చేశారు. అప్పుడు ఉచితంగా ప్లాట్లను రెగ్యులరైజ్​ చేస్తామని చెప్పి.. ఇప్పుడు పెద్ద స్కాంకు తెరలేపారని విమర్శించారు. సీఎం రేవంత్​రెడ్డి ప్రజలు చనిపోతే డబ్బులు వసూలు చేయడానికి డెత్​ రెగ్యులేషన్​ స్కీం కూడా తెస్తారని ఆరోపించారు.