అక్షరటుడే, వెబ్​డెస్క్​: తెలంగాణ ప్రజలకు మాజీ సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రి బండి సంజయ్​ డిమాండ్​ చేశారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. కృష్ణా జలాల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం జరగడానికి కారణం కేసీఆరేనని పేర్కొన్నారు. ఏపీ నాయకులతో అప్పటి సీఎం కుమ్మక్కయ్యారని విమర్శించారు. తెలంగాణకు 575 టీఎంసీల వాటా ఉంటే కేవలం 299 టీఎంసీలకే కేసీఆర్ సంతకాలు పెట్టివచ్చారని మండిపడ్డారు. ఇందుకు సంబంధించి నా వద్ద అన్నీ ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. దీనికి బీఆర్​ఎస్​ పార్టీ సమాధానం చెప్పాలని డిమాండ్​ చేశారు.