అక్షరటుడే, వెబ్‌డెస్క్: ఓ యువతి ప్రమాదవశాత్తు లారీ కింద చిక్కుకోగా కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించి స్థానికుల సాయంతో కాపాడారు. మానకొండూరు మండలం కల్లెడ గ్రామానికి చెందిన దివ్యశ్రీ సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదానికి గురై సింగాపురం సమీపంలో లారీ కింద ఇరుక్కుపోయింది. ఆ సమయంలో ములుగు పర్యటనకు వెళ్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రమాదాన్ని గుర్తించి వాహనాన్ని ఆపారు. స్థానికులు, వాహనదారుల సాయంతో యువతిని కాపాడారు. లారీ టైర్ కింద యువతి జుట్టు చిక్కుకోవడంతో కత్తిరించి ఆమెను బయటకు తీశారు. అనంతరం దివ్యశ్రీని కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.