అక్షరటుడే, కామారెడ్డి: కేంద్ర మంత్రి బండి సంజయ్ శనివారం కామారెడ్డికి రానున్నారు. లింగాపూర్ స్టేజి వద్ద గల బృందావన్ గార్డెన్లో సాయంత్రం 6 గంటలకు నిర్వహించనున్న పట్టభద్రుల ఆత్మీయ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డితో పాటు బీజేపీ నాయకులు పాల్గొంటారు.