అక్షరటుడే, హైదరాబాద్: రాహుల్‌గాంధీ వ్యాఖ్యలకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. యూపీఏ వైఫల్యాలను ఎన్డీఏకు ఆపాదించడం రాహుల్ అవివేకమని పేర్కొన్నారు. కాంగ్రెస్ 10 సంవత్సరాల పాలనలో 6 శాతం ఉపాధి పెరిగితే, బీజేపీ పాలనలో ఉపాధి 36 శాతానికి పెరిగిందని చెప్పారు. మోడీ 10 ఏళ్ల పాలనలో 4.9 కోట్ల ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపారు. వ్యవసాయరంగంలో ఉపాధిని తీసుకుంటే.. కాంగ్రెస్ హయాంలో 16 శాతం తగ్గితే, మోడీ హయాంలో 19 శాతానికి పెరిగిందన్నారు. 2023-24 నాటికి దేశంలో నిరుద్యోగిత రేటు 3.2 శాతానికి తగ్గిందని కిషన్‌రెడ్డి చెప్పుకొచ్చారు.