అక్షరటుడే, వెబ్డెస్క్: ప్రపంచవ్యాప్తంగా ఎరువుల ధరలు పెరిగినా దేశంలో మాత్రం పెరగలేదని కేంద్ర మంరతి కిషన్రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీలు పెంచి రైతులపై భారం పడకుండా చూస్తోందని పేర్కొన్నారు. కేంద్ర పథకాలు రాష్ట్రంలో అమలు కావాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలన్నారు. ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. పదేళ్లు రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకుందని.. ఇప్పుడు సోనియా గాంధీ కుటుంబం దోపిడీ చేస్తోందని ఆరోపించారు.