అక్షరటుడే, ఇందూరు: ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శనివారం ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం 10:45 గంటలకు నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని రమాకాంత్ ఫంక్షన్ హాల్లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12:30 గంటలకు నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించనున్నారు.