అక్షరటుడే, వెబ్​డెస్క్​: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్​ తన బడ్జెట్​లో చిన్న మధ్య తరహా పరిశ్రమలకు వరాలు కురిపించారు. స్టార్టప్​లను ప్రోత్సహించడానికి చర్యలు చేపడతామన్నారు. ఎంఎస్​ఎంఈలకు ఇచ్చే రుణాల పరిమితి రూ.పది కోట్లకు పెంచారు. స్టార్టప్​లకు రూ.పది కోట్ల నుంచి రూ.20 కోట్లకు పెంచుతున్నట్లు తెలిపారు. బొమ్మల తయారీకి ప్రత్యేక పథకం తీసుకొస్తామని పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఫుడ్​ ప్రాసెసింగ్​ పరిశ్రమలకు ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు.