అక్షరటుడే, నిజామాబాద్ టౌన్ : జిల్లా కలెక్టరేట్ ఎదుట ఈనెల 14న నిర్వహించే నిరసనకు షెడ్యూల్డ్ తెగ ఉపాధ్యాయులందరూ తరలిరావాలని డీటీఫ్ ప్రతినిధి బాలయ్య, ఎస్సీ, ఎస్టీ యూస్ ప్రతినిధి సుధాం, ఆర్‌యూపీపీ ప్రతినిధి జమీల్ తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం ఇటీవల డీఈవోని కలిస్తే అనుచితంగా ప్రవర్తించారని, దీనికి నిరసనగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.