అక్షరటుడే, ఇందూరు: సీఎంఆర్ఎఫ్ అప్లై చేసుకున్న మొత్తం ఖర్చులో 50 శాతం లబ్ధిదారులకు చెల్లించాలని అసెంబ్లీలో డిమాండ్ చేస్తానని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆయా కారణాలతో అనారోగ్యంతో బాధపడి చికిత్స చేసుకున్న బాధితులకు సీఎం సహాయ నిధి ద్వారా 84 మందికి రూ.25,65,000 అందజేశామన్నారు. ఇప్పటివరకు జిల్లాలో ఎక్కువ మొత్తం అర్బన్ నియోజకవర్గానికి వచ్చాయని గుర్తు చేశారు. ప్రభుత్వం బాధితులకు ఆస్పత్రి ఖర్చు మొత్తంలో 15 నుంచి 20 శాతం మాత్రమే చెల్లిస్తుందని, వీటిని 50శాతం పెంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.