అక్షరటుడే, ఇందూరు: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కాంగ్రెస్ నాయకులు అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నారని అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. ఆదివారం తన క్యాంప్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2047 నాటికి వికసిత్ భారత్ సాకారానికి ముందడుగే ఈ బడ్జెట్ అని పేర్కొన్నారు. రూ.12లక్షల లోపు ఆదాయపు పన్ను మినహాయింపు, పరిశ్రమల అభివృద్ధి, రైతుల సంక్షేమం కోసం క్రెడిట్ కార్డుల ద్వారా తక్కువ వడ్డీకే రుణాలు కల్పించనున్నారని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు లక్ష్మీనారాయణ, మండల అధ్యక్షుడు నాగరాజు, మల్లేష్ గుప్తా, ఆనంద్, పవన్ తదితరులు పాల్గొన్నారు.