అక్షరటుడే, ఇందూరు: నిజామాబాద్ నగర మేయర్ నీతూ కిరణ్ భర్త దండు శేఖర్ పై జరిగిన దాడిని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా ఖండించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శేఖర్ ను మంగళవారం పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిందితుడు ఏ పార్టీకి చెందిన వ్యక్తి అయినా కఠినంగా శిక్షించాలని పోలీసు శాఖను కోరారు. సమస్య ఏదైనా చట్టాన్ని చేతిలో తీసుకోవడం, దాడులు చేయడం సరైన పద్ధతి కాదన్నారు. ఎమ్మెల్యే వెంట భాజపా జిల్లా ఉపాధ్యక్షుడు లక్ష్మీనారాయణ, కార్పొరేటర్ ప్రవళిక, నాయకులు శ్రీధర్, భాస్కర్, మఠం పవన్ తదితరులున్నారు.