అక్షరటుడే, ఇందూరు: ఎస్సీల అభివృద్ధిపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక దృష్టి సారించారని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. గురువారం పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ బలహీనవర్గాల అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు గడిచినా ఎస్సీలకు ఎలాంటి పథకాలు అమలు చేయలేదని విమర్శించారు. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీలకు భద్రత కరువైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సమావేశంలో ఎస్సీ మోర్చా అధ్యక్షుడు శివప్రసాద్, నాయకులు బాలకృష్ణ, పవన్ తదితరులు పాల్గొన్నారు.