అక్షరటుడే, ఇందూరు: నగరంలోని మిర్చి కాంపౌండ్ బస్తీ దవాఖానా ఓపీ సేవల్లో అవకతవకలపై అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా మండిపడ్డారు. మంగళవారం 34వ డివిజన్లో పర్యటించారు. కాలనీ వాసుల ఫిర్యాదు మేరకు బస్తీ దవాఖానాను సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దవాఖానాకు వచ్చే రోగుల సంఖ్య తక్కువగా ఉంటే ఓపీ రిజిస్టర్ లో ఎక్కువగా ఎందుకు నమోదు చేస్తున్నారని ప్రశ్నించారు. దీంతో మందులు పక్కదారి పడుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానన్నారు. రిజిస్టర్లో నమోదు చేసిన రోగుల ఫోన్ నెంబర్ కి స్వయంగా ఎమ్మెల్యే ఫోన్ చేయడంతో ఈ తతంగం బయటపడింది.
![](https://aksharatoday.com/wp-content/uploads/2025/01/888-1024x455.jpg)