అక్షరటుడే, వెబ్డెస్క్: ఉత్తరాఖండ్ బస్సు ప్రమాదం ఘటనలో మృతుల సంఖ్య 36కు చేరింది. 43 మందితో గర్వాల్ నుంచి కమవోన్ వెళ్తున్న బస్సు ఉదయం లోయలో పడిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మొదటి 20 మంది చనిపోగా ప్రస్తుతం మృతుల సంఖ్య 36 కు చేరింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారాన్ని ప్రధాని ప్రకటించారు.