అక్షరటుడే, వెబ్ డెస్క్: బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిపై మంత్రి జూపల్లికి పలువురు ఫిర్యాదు చేశారు. వర్ని మండల కాంగ్రెస్ నాయకులు మంత్రి జూపల్లి కృష్ణారావును కలిసి ఫిర్యాదును అందజేశారు. సోమవారం జిల్లా కేంద్రానికి విచ్చేసిన మంత్రికి ఈ విషయమై విన్నవించారు. వర్ని మండల అభివృద్ధికి ప్రభుత్వం రూ.10 కోట్లు మంజూరు చేసింది. అయితే పనులు కొనసాగుతున్న తరుణంలో పోచారం బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తన పలుకుబడితో నిధులను నిలిపివేయించినట్లు వర్ని మండల నాయకులు ఆరోపించారు. కావాలనే తమపై పోచారం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వాపోయారు. కాగా.. ఏనుగు రవీందర్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి మధ్య వర్గపోరు నడుస్తోంది. ఏనుగు వర్గీయులు పోచారం శ్రీనివాసరెడ్డిపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.