Varun Chakravarthy : భార‌త్‌కి వ‌స్తే న‌న్ను చంపేస్తామ‌ని బెదిరించారు.. యువ క్రికెటర్ సంచ‌ల‌న కామెంట్స్

Varun Chakravarthy : భార‌త్‌కి వ‌స్తే న‌న్ను చంపేస్తామ‌ని బెదిరించారు.. వ‌రుణ్ చక్ర‌వ‌ర్తి సంచ‌ల‌న కామెంట్స్
Varun Chakravarthy : భార‌త్‌కి వ‌స్తే న‌న్ను చంపేస్తామ‌ని బెదిరించారు.. వ‌రుణ్ చక్ర‌వ‌ర్తి సంచ‌ల‌న కామెంట్స్
Advertisement

అక్ష‌ర‌టుడే, వెబ్‌డెస్క్‌ Varun Chakravarthy : వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి Varun Chakravarthy.. ఛాంపియ‌న్స్ ట్రోఫీలో అద్భుత‌మైన బౌలింగ్‌తో అంద‌రి దృష్టిని ఆకర్షించారు. Champions Trophy చాంపియన్స్ ట్రోఫీలో వికెట్ల మీద వికెట్లు తీస్తూ భారత్ కప్పు గెలవడంలో ముఖ్య పాత్ర పోషించాడు. బ్రేక్ త్రూ కావాల‌న్న‌ప్పుడు రోహిత్ శ‌ర్మ.. వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తిని రంగంలోకి దించేవాడు. చాన్నాళ్లు టీమ్‌కు దూరమై ఇబ్బందులు పడిన Varun Chakravarthy వరుణ్.. Champions Trophy చాంపియన్స్ ట్రోఫీతో తన స‌త్తా ఏంటో నిరూపించుకున్నాడు. ఇక IPl 2025 ఐపీఎల్ 2025లో కూడా రాణించి టీమ్‌లో త‌న స్థానం సుస్థిరం చేసుకోవాల‌ని అనుకుంటున్నాడు.

Varun Chakravarthy : భ‌య‌ప‌డి దాక్కున్నా..

భారత జట్టుకు మూడేళ్ల పాటు దూరమైన వరుణ్ చక్రవర్తి.. హెడ్ కోచ్ Gautam Gambhir గౌతమ్ గంభీర్ సాయంతో తిరిగి టీమిండియాలో స్థానం ద‌క్కించుకున్నాడు. సంచలన ప్రదర్శనతో ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపికై 3 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు తీసాడు. అయితే వ‌రుణ్ చక్ర‌వ‌ర్తి తాజాగా తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ‘టీ20 వరల్డ్ కప్-2021 వైఫల్యం తర్వాత నేను ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నాను. India భారత్‌కు తిరిగి వస్తే చంపేస్తామంటూ చాలా బెదిరింపులు వ‌చ్చాయి. కొందరు నన్ను బైక్ మీద ఫాలో అయ్యి భయపెట్టారు. దాంతో నేను డిప్రేషన్‌లోకి వెళ్లాను

ఇది కూడా చ‌ద‌వండి :  Virat Kohli : రిటైర్​మెంట్​పై క్లారిటీ ఇచ్చిన కింగ్​ కోహ్లీ..

అవి నా జీవితంలో చీకటి రోజులు. ఇండియాకు వచ్చే ధైర్యం చేస్తే మిగలవని వార్నింగ్ ఇవ్వ‌డంతో భయపడి దాక్కోవాల్సి వచ్చిందని వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి అన్నాడు కమ్‌బ్యాక్ కోసం ప్రయత్నించినా తనను సెలెక్టర్లు పట్టించుకోలేదన్నాడు. టీమ్‌లోకి ఎంట్రీ ఇవ్వడం కంటే రీఎంట్రీ కష్టమనేది త‌న‌కు బాగా అర్ధ‌మైంద‌ని వ‌రుణ్ చెప్పుకొచ్చాడు. టీ20 వరల్డ్ కప్-2021 వైఫల్యం తర్వాత నన్ను నేను ఎంతో మార్చుకున్నా. డైలీ రొటీన్ దగ్గర నుంచి ప్రాక్టీస్ వరకు అన్ని విష‌యాల‌లో మార్పులు చేసుకున్నా. ఒక సెష‌న్‌లో 50కి పైగా బంతులు వేసేవాడిని. ఆ త‌ర్వాత దానిని డబుల్ చేశా. ఎంత బాగా ఆడిన అవ‌కాశం రావ‌డానికి మూడేళ్లు గ‌డిచాయి. ఇక ఆశ‌లు వ‌దిలేసుకున్న నాకు కేకేఆర్ ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకోవడం, నేను ఆ సీజన్‌లో రాణించడం పున‌ర్జ‌న్మ‌నిచ్చిన‌ట్టు అయింది. టీమిండియాలోకి కమ్‌బ్యాక్ చాన్స్ ఇచ్చారు అని వరుణ్ చెప్పుకొచ్చాడు.

Advertisement