అక్షరటుడే, బోధన్: రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా బోధన్ మున్సిపాలిటీలో విజయోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బోధన్ మున్సిపాలిటీలో స్పెషల్ శానిటేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని 142 మున్సిపాలిటీల్లో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు కమిషనర్ వెంకట్ నారాయణ తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ తూము పద్మ, కౌన్సిలర్లు శరత్ రెడ్డి, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.