అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: వియత్నాం ఎలక్ట్రిక్ కార్ల తయారీదారీ సంస్థ విన్ఫాస్ట్.. ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో-2025లో అనేక వాహనాలను ప్రదర్శించింది. ఇందులో విన్ఫాస్ట్ VF 6, విన్ఫాస్ట్ VF 7లను ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఈ ఏడాది పండుగ సీజన్లో వీటిని భారతదేశంలో ప్రవేశపెట్టొచ్చు. చౌకైన ఎలక్ట్రిక్ కారు వినాఫాస్ట్ VF 3ను 2026లో భారతదేశంలో విడుదల చేయనున్నట్లు కంపెనీ ధృవీకరించింది. ఈ కారు టాటా నానో కంటే చిన్నగా కనిపిస్తున్నా, ఇందులో నలుగురు హాయిగా ప్రయాణించవచ్చు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 215 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ధర రూ. 7 – 10 లక్షల మధ్య ఉంటుంది.