అక్షరటుడే, ఇందూరు: నగరంలోని ఆదర్శనగర్ లో గల హింగులాంబిక ఆలయ సేవాసమితి అధ్యక్షురాలిగా విజయలత మైస్కర్ ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో సమీప ప్రత్యర్థి రాజేంద్రకుమార్ పై 57 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. మొత్తం 335 మంది ఓటర్లలో 296 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలైన ఓట్లలో 176 ఓట్లు విజయలతకి, 119 ఓట్లు రాజేంద్రకుమార్ కు పోలయ్యాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులతో ఆలయ అభివృద్ధికి మరింత కృషి చేస్తానని పేర్కొన్నారు.