అక్షరటుడే, బాన్సువాడ : బీర్కూరు మండల కేంద్రానికి చెందిన ఓ స్వీట్ హోంలో నిర్వాహకులు బూజు పట్టిన స్వీట్లు విక్రయిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. స్వీట్‌హోంపై చర్యలు తీసుకోవాలని శనివారం బాన్సువాడకు వచ్చిన సబ్ కలెక్టర్ కిరణ్మయికి ఫిర్యాదు చేశారు. స్వీట్లలో అప్పుడప్పుడు వెంట్రుకలు కూడా వస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సదరు స్వీట్‌హోం వివరాలు తెలుసుకుని విచారణ చేస్తామని సబ్ కలెక్టర్ హామీ ఇచ్చారని గ్రామస్తులు పేర్కొన్నారు.