అక్షరటుడే, బాన్సువాడ: వర్ని మండల కేంద్రం నుంచి తగిలేపల్లికి వెళ్లే రోడ్డులో అక్రమ నిర్మాణాలను తొలగించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులు గురువారం వర్నిలో ధర్నా నిర్వహించారు. రూ. 1.50 కోట్లతో నిర్మాణం చేపట్టే రోడ్డుకు ఇరువైపులా 33 ఫీట్ల రోడ్డును వేయాలని, మధ్యలో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించాలని డిమాండ్ చేశారు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.