Virat Kohli : ఫైన‌ల్‌కు ముందు అభిమానుల‌ను ఆందోళ‌న‌కు గురి చేస్తున్న కోహ్లీ.. అస‌లేమైందంటే..!

Virat Kohli : ఫైన‌ల్‌కి ముందు అభిమానుల‌ని ఆందోళ‌న‌కి గురి చేస్తున్న కోహ్లీ.. అస‌లేమైంది నీకు?
Virat Kohli : ఫైన‌ల్‌కి ముందు అభిమానుల‌ని ఆందోళ‌న‌కి గురి చేస్తున్న కోహ్లీ.. అస‌లేమైంది నీకు?
Advertisement

అక్ష‌ర‌టుడే, వెబ్‌డెస్క్‌ Virat Kohli : ఛాంపియ‌న్స్ ట్రోఫీలో ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క మ్యాచ్ కూడా ఓడ‌ని భార‌త జట్టు ఇప్పుడు ఫైన‌ల్‌లో టీమిండియాతో త‌ల‌ప‌డేందుకు సిద్ధ‌మైంది. ఆదివారం మ‌ధ్యాహ్నం దుబాయ్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న ఈ మ్యాచ్ కోసం ఎంతో మంది ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఒక్క మ్యాచ్‌లో గెలిస్తే భార‌త్ ఖాతాలో మ‌రో ఐసీసీ ట్రోఫీ చేర‌డం ఖాయం. అయితే ఈ మ్యాచ్‌కి ముందు భార‌త్ అభిమానుల‌కి చేదు వార్త ఒక‌టి వినిపించింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గాయపడ్డాడని, అందుకే ప్రాక్టీస్ సెషన్ కు దూరమయ్యాడని సమాచారం.

Virat Kohli : ఆందోళ‌న‌..

నెట్స్ లో పేస్ బౌలర్ బంతిని ఆడేందుకు యత్నించగా, కోహ్లీ మోకాలి సమీపంలో దెబ్బ తగిలిందని.. దాంతో ప్రాక్టీస్ మధ్యలోనే వెళ్లిపోయాడని రిపోర్ట్స్ వచ్చాయి. దెబ్బ త‌గిలిన వెంట‌నే కోహ్లీ వద్దకు వెంటనే భారత్‌కు చెందిన ఫిజియోథెరపిస్టులు వచ్చారు. కోహ్లీ మోకాలిపై స్ప్రే కొట్టి ఫిజియోథెరపిస్టులు ప్రాథమిక చికిత్స చేశారు. కోహ్లీకి గాయం వల్ల స్వల్ప నొప్పితో బాధపడ్డ‌ప్ప‌టికీ, ప్రాక్టీసు సెషన్‌ వద్దే ఉండి తోటి ఆటగాళ్లు సాధన చేస్తున్న తీరును అతడు ప‌రిశీలించాడు. అయితే అత‌డికి అయిన గాయంపై సందేహాలు నెల‌కొన్నాయి.. కోహ్లీకి గాయం కావడంతో అతడు ఆడతాడా? అన్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఇది కూడా చ‌ద‌వండి :  India Vs New Zealand : హోరాహోరీ.. ఈ రోజు ఫైన‌ల్‌లో విజేత ఎవ‌రు, భార‌త్ ప్రతీకారం తీర్చుకుంటుందా?

అయితే గాయం తీవ్రత తక్కువేనని ఫైనల్ మ్యాచ్ కు కోహ్లీ సిద్ధంగా ఉంటాడని ఫిజియో, సహాయక సిబ్బంది చెప్ప‌డంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ప్ర‌స్తుత ఛాంపియ‌న్స్ ట్రోఫీలో టీమిండియాకు కోహ్లీ వెన్నుముక్కలా నిలుస్తున్న విష‌యంలో తెలిసిందే. ముఖ్యంగా ఛేజింగ్‌లో త‌న స‌త్తా చాటి.. భార‌త్‌ను ఫైన‌ల్‌కు చేర్చ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు. పాకిస్తాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో కోహ్లీ సెంచ‌రీ సాధించి సెమీస్‌కి తీసుకెళ్లాడు. ఇక ఆసిస్‌తో జ‌రిగిన సెమీ ఫైన‌ల్‌లో 84 పరుగులు చేసి.. టీమ్ విజ‌యానికి దోహ‌ద ప‌డ్డాడు. కోహ్లీ గాయం కార‌ణంగా.. ఇప్పుడు కీల‌క‌మైన ఫైన‌ల్ మ్యాచ్‌కు ముందు ఫ‌లితాలపై ప్ర‌భావం చూపే అవ‌కాశం ఉందని విశ్లేష‌కులు భావిస్తున్నారు. కాగా, ఐసీసీ టోర్నమెంట్లలో భారత్ పై కివీస్ కు మంచి రికార్డు ఉంది. న్యూజిలాండ్ 10 మ్యాచ్ లు నెగ్గితే భారత్ 6 మ్యాచ్ లలో విజయం సాధించింది.

Advertisement