అక్షరటుడే, భీమ్గల్: రాష్ట్రంలో 61ఏళ్లు పైబడిన వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని వీఆర్ఏలు డిమాండ్ చేశారు. ఈ మేరకు భీమ్గల్ మండల కేంద్రంలో బుధవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న వీఆర్ఏల సమస్యలు తక్షణమే పరిష్కరించాలన్నారు. 61 ఏళ్లు నిండిన వీఆర్ఏల వారసులుగా తాము పదిహేనేళ్లుగా పని చేస్తున్నామన్నారు. తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా 3,798 మందిని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.