అక్షరటుడే, జుక్కల్: నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. నాలుగు గేట్ల ద్వారా అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 20వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండడంతో నాలుగు వరద గేట్ల ద్వారా అంతే స్థాయిలో నీటిని మంజీరలోకి వదులుతున్నారు. ప్రాజెక్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతుండడంతో పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. ఈ సందర్బంగా ఓ పర్యాటకుడు తీసిన డ్రోన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.