అక్షరటుడే, వెబ్‌డెస్క్: ఓపెనర్లతో సహా బ్యాట్స్ మెన్ ఇటు వచ్చి అటు పెవిలియన్ బాట పడుతుంటే ఒక్కడే ఇంగ్లండ్ బౌలర్లకు ఎదురొడ్డి నిలిచాడు. ఆశలు వదిలేసుకున్న టీ20 రెండో మ్యాచ్ ను అదరగొట్టి విజయ తీరానికి చేర్చాడు. టీమిండియా తెలుగు కుర్రాడు 55 బంతుల్లో 5 సిక్సర్లు, 4 ఫోర్లతో 72 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
టీమిండియా, ఇంగ్లండ్ మధ్య ఉత్కంఠగా సాగిన రెండో టీ20 మ్యాచ్ లో.. టీమిండియా నాలుగు బంతులు మిగిలి ఉండగానే 2 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ను మట్టికరిపించింది. టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 165 పరుగులు చేసింది. టీమిండియా 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగి, 19 పరుగులకే ఇద్దరు ఓపెనర్లను కోల్పోయింది.
ఇంగ్లండ్ తో జరిగిన తొలి మ్యాచ్ లో 79 పరుగులు చేసిన అభిషేక్ శర్మ రెండో మ్యాచ్ లో 12 పరుగులకే మార్క్ వుడ్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. సంజూ శాంసన్ ఐదు పరుగులు చేసి జఫ్రా ఆర్చర్ బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చాడు. టీమిండియా టీ20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ 7 బంతుల్లో 12 పరుగులు చేసి ఔటయ్యాడు.