అక్షరటుడే, వెబ్ డెస్క్: నిజామాబాద్ నగరంలోని ఆనంద్ నగర్ లో నాలాలో గల్లంతైన చిన్నారి మృతదేహం లభ్యమైంది. గురువారం ఉదయం గాలింపు చర్యలు చేపట్టిన సిబ్బందికి మృతదేహం కనిపించగా బయటకు వెలికితీశారు. బుధవారం సాయంత్రం తన ఇంటివద్ద ఆడుకుంటున్న రెండున్నరేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు మురుగు కాల్వలో పడిపోయింది. అప్పటికే కాల్వలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో కొట్టుకుపోయింది. కాసేపటికి ఈ విషయాన్ని గుర్తించిన కుటుంబీకులు గాలింపు చేపట్టారు. అనంతరం డిజాస్టర్ సిబ్బంది సైతం రంగంలోకి దిగి గాలింపు జరిపారు. చీకటి పడడంతో తిరిగి గురువారం ఉదయం నుంచి కాల్వ పొడువునా సిబ్బంది గాలించగా.. ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి కొద్ది దూరంలో చిన్నారి మృతదేహం లభ్యమైంది. అనన్య మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.