అక్షరటుడే, భిక్కనూరు : రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన ఘటన మండలంలోని శ్రీసిద్ధరామేశ్వర్ నగర్ శివారులో జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని బస్వాపూర్ కు చెందిన సిద్ధవ్వ (48) పెద్ద మల్లారెడ్డి క్రాసింగ్ వద్ద డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో నివసిస్తుంది. ఆమె సిద్ధరామేశ్వర్ నగర్ శివారులోని ఓ హోటల్లో పనిచేస్తుంది. బుధవారం సాయంత్రం విధులు ముగించుకొని తిరిగి ఇంటికి వెళ్తూ రోడ్డు దాటుతుండగా ప్రైవేట్ బస్సు ఢీకొంది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.