మంత్రాల నెపంతో మహిళ హత్య!

0

అక్షరటుడే, వెబ్ డెస్క్: నవీపేట్ మండలం కోస్లి శివారులో రెండ్రోజుల కిందట మహిళ అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మృతురాలు రెంజల్ మండలానికి చంద్రకళగా గుర్తించిన పోలీసులు.. మంత్రాల నెపంతోనే ఆమెను హతమార్చినట్లు తేల్చారు. డబ్బుల వ్యవహారం కూడా హత్యకు మరో కారణంగా తెలుస్తోంది. ఇప్పటికే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు చివరకు హత్యానేరం కింద సెక్షన్లు మార్పు చేశారు. త్వరలోనే నిందితులను అధికారికంగా అరెస్టు చూపనున్నారు.