అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : నగరంలోని బోర్గాం(పి) ఉన్నత పాఠశాలలో శుక్రవారం మహిళా ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పాఠశాలలోని ఉపాధ్యాయినులను హెచ్ఎం శంకర్ సన్మానించారు. ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ సావిత్రిబాయి సేవలను కొనియాడారు. పాఠశాలలో ఉత్తమ బోధించడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఉపాధ్యాయినులను సన్మానించడం ఆనందంగా ఉందన్నారు.