అక్షరటుడే, వెబ్ డెస్క్: నిజామాబాద్ రైల్వే స్టేషన్ లో దారుణం చోటు చేసుకుంది. నడుస్తున్న రెలును ఎక్కబోయి ఓ మహిళా ప్రయాణికురాలు మృతి చెందింది. రైల్వే ఎస్సై సాయా రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి పట్టణానికి చెందిన పసుల రేవతి శుక్రవారం నిజామాబాద్ నగరానికి వచ్చింది. తిరిగి శనివారం ఉదయం 6 గంటల డెమో రైలులో కామారెడ్డికి వెళ్లేందుకు టికెట్ తీసుకుంది. అప్పటికే రైలు మెళ్లగా కదలగా.. నడుస్తున్న రైలు ఎక్కబోయింది. పట్టు తప్పి రైలు కింద పడిపోయి మృతి చెందింది. మృతురాలి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.