అక్షరటుడే, వెబ్‌డెస్క్ : దసరా సెలవులతో పాటు ఆదివారం కలిసి రావడంతో యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. స్వామి వారి నిత్య కల్యాణం నిర్వహించే సమయానికి మెట్లదారిలోను భక్తుల రద్దీ నెలకొంది. ప్రసాద విక్రయశాల, శ్రీసత్యనారాయణ స్వామి వ్రత మండపం, కొండకింద విష్ణు పుష్కరిణి, కారు పార్కింగ్, బస్టాండ్ పరిసరాలు రద్దీగా ఉన్నాయి.