అక్షరటుడే, బోధన్: ఎడపల్లి మండలం కుర్నాపల్లిలో విద్యుత్‌షాక్‌తో విద్యార్థి మతిన్ మృతిచెందగా.. గ్రామస్థులు ఆందోళనకు దిగారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే బాలుడు మృతి చెందాడని రోడ్డుపై భైఠాయించారు. ఏఈ, లైన్‌మన్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు వారిని సముదాయించడానికి యత్నించగా విద్యుత్ అధికారులపై చర్యలు తీసుకునే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు.