అక్షరటుడే, ఎల్లారెడ్డి: రాష్ట్రంలోని అన్నివర్గాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. లింగంపేట్ మండలానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో వైసిపి విఠల్ రెడ్డి, ఐలాపూర్ ఎంపీటీసీ దేవేందర్, సొసైటీ డైరెక్టర్ సాయాగౌడ్, మాజీ ఎమ్మెల్యే సురేందర్ సన్నిహితులు సిద్ధారెడ్డి, పీర్ సింగ్, సాయిలు ఉన్నారు.