అక్షరటుడే, ఎల్లారెడ్డి : పండుగలు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ఎల్లారెడ్డి సీఐ రవీందర్ నాయక్ సూచించారు. శనివారం లింగంపేట మండల కేంద్రంలో నిర్వహించిన శాంతి సమావేశంలో మాట్లాడారు. వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ నరేందర్, ఎంపీడీవో నరేష్, ఎస్సై అరుణ్ కుమార్, ఏఎస్సై ప్రకాష్ ఉన్నారు.