అక్షరటుడే, ఎల్లారెడ్డి : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అవకతవకలకు పాల్పడిన అధికారులకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఎల్లారెడ్డి కోర్టు న్యాయమూర్తి హరిత బుధవారం తీర్పు వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల అవకతవకలపై 2009లో లింగంపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు విచారణ చేపట్టి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. కేసును విచారించిన జడ్జి ఏఈలు, సంపత్ కుమార్, బిక్కులాల్, వీవీలు వజ్రమ్మ, రాజమణిలకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించారు. అలాగే వీరికి 10 వేల రూపాయల జరిమానా వేశారు. జరిమానా చెల్లించకపోతే మరో ఆరు నెలల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.