అక్షరటుడే, ఎల్లారెడ్డి: రాష్ట్రంలో ప్రజా కంటకుడిగా సీఎం రేవంత్ రెడ్డి పాలన సాగిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్ విమర్శించారు. తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలను మార్చడానికి నిరసనగా సదాశివనగర్ మండలం వజ్జపల్లి గ్రామంలో మంగళవారం గత తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విగ్రహాన్ని మార్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.