అక్షరటుడే, ఎల్లారెడ్డి: ఎన్నో ఏళ్లుగా గతుకుల రోడ్లతో ఇబ్బంది పడుతున్న మౌలాన్ ఖేడ్ గ్రామానికి రూ.3.21 కోట్లతో రోడ్డు మంజూరైనట్లు ఎమ్మెల్యే మదన్ రావు తెలిపారు. గత ప్రభుత్వాలకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా రోడ్లు మంజూరు చేయలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామానికి మంజూరు చేయించిన మూడు కిలోమీటర్ల రోడ్డు పనులను త్వరితగతిన పూర్తిచేసి తమకు రోడ్డు సౌకర్యం కల్పించాలని గ్రామస్థులు ఎమ్మెల్యేను కోరారు. నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యేను వారు సన్మానించారు.