అక్షరటుడే, ఎల్లారెడ్డి: వసతి గృహాల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఆర్డీవో ప్రభాకర్ అన్నారు. సోమవారం రాత్రి బాలికల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. వారికి అందుతున్న వసతులను అడిగి తెలుసుకున్నారు. వసతి గృహంలో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని విద్యార్థులు ఆర్డీవోను కోరారు. దీంతో ఆయన స్పందిస్తూ విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాలను కల్పించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బాలికలు సుచి శుభ్రత పాటించాలని సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకొని చదువుల్లో, ఆటల్లో రాణించాలాన్నారు. పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని చెప్పారు.