రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

0

అక్షరటుడే, ఎల్లారెడ్డి: మండలంలోని సోమార్‌పేట్‌ గేటు వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహమ్మద్‌ నగర్‌ మండలం హసన్‌పల్లికి చెందిన కురుమ ప్రశాంత్‌(23) ఎల్లారెడ్డి నుంచి స్వగ్రామానికి బైకుపై వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన లారీ వేగంగా ప్రశాంత్‌ను ఢీకొట్టింది. యువకుడు లారీ కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.