అక్షరటుడే, బాన్సువాడ: బాన్సువాడ పట్టణానికి చెందిన ఏర్ల విజయలక్ష్మి తెలంగాణ పద్మశాలి సంఘం రాష్ట్ర మహిళా కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్ హరిహర కళాభవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పద్మశాలీల ఐక్యతకు పాటుపడతానని, మహిళలకు అండగా నిలబడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.