అక్షరటుడే, ఎల్లారెడ్డి: ప్రజా సమస్యలను వెలికితీస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న ‘అక్షరటుడే’ కృషి అభినందనీయమని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు అన్నారు. పట్టణంలో సోమవారం ‘అక్షరటుడే’ క్యాలెండర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అనతికాలంలోనే డిజిటల్ మీడియాలో ‘అక్షరటుడే’ ప్రజాదరణ పొందుతోందన్నారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి మున్సిపల్ మాజీ ఛైర్మన్ కుడుముల సత్యనారాయణ, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు కురుమ సాయిబాబా, ‘అక్షరటుడే’ ఎల్లారెడ్డి ఆర్సీ ఇన్ఛార్జి వడ్ల రవికుమార్, కాంగ్రెస్ నాయకులు నాగం గోపి తదితరులు పాల్గొన్నారు.