అక్షరటుడే, ఇందూరు: నగరంలోని దయానంద యోగా సెంటర్ లో రథసప్తమి సందర్భంగా యోగా అభ్యాసకులు 108 సూర్య నమస్కారాలు చేశారు. సెంటర్ డైరెక్టర్ యోగా గురువు రాంచందర్ ఆధ్వర్యంలో సూర్య నమస్కారాలు చేశారు. కార్యక్రమంలో యోగా గురువు గురుపాదం, భూమాగౌడ్, అశోక్ కుమార్, మురళి, మురళి గుప్తా, శ్రీనివాస్ గుప్తా, తోట రాజశేఖర్, జగన్మోహన్, నర్సయ్య పాల్గొన్నారు.