అక్షరటుడే, ఎల్లారెడ్డి: ఒంటరితనం భరించలేక ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన లింగంపేట మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. లింగంపేట గ్రామానికి చెందిన కాశి నగేష్(20) కూలి పని చేసుకుని జీవించేవాడు. తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో పెద్దనాన్న కాశిచంద్రయ్య దగ్గర ఉండేవాడు. తనకు ఎవరూ లేరని మనస్తాపం చెంది గ్రామ శివారులోని చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.