యువకుడి దారుణ హత్య

0

అక్షరటుడే, వెబ్ డెస్క్: కామారెడ్డి శివారులోని రామేశ్వర్ పల్లి వద్ద ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మంగళవారం ఉదయం మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. మృతుడు ఆరేపల్లి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ బోయిని నవీన్ గా గుర్తించారు. సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పొడిచి హత్య చేసినట్లు తెలుస్తోంది.