అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: గల్ఫ్‌ బాధిత కుటుంబానికి యువకులు బాసటగా నిలిచారు. చందాలు పోగు చేసి ఆర్థిక సహాయం అందజేశారు. డిచ్‌పల్లి మండలం సుద్దపల్లికి చెందిన మేకల హరీశ్ దుబాయిలో మృతిచెందాడు. దీంతో పలువురు యూత్‌ సభ్యులు ముందుకు వచ్చి చందాలు జమ చేశారు. సోమవారం బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పానుగంటి సతీష్‌రెడ్డి ఆధ్వర్యంలో రూ.62,300 మృతుడి భార్య రాజమణికి అందజేశారు. ఈ సందర్భంగా సతీశ్ రెడ్డి మాట్లాడుతూ.. గల్ఫ్‌లో మృతిచెందిన హరీష్‌కు ప్రభుత్వం రూ. 5లక్షల పరిహారం అందించాలని కోరారు. కార్యక్రమంలో గ్రామ యువజన సంఘ సభ్యులు వినోద్‌ రెడ్డి, రాజు, ఆనంద్, అబ్బన్న, బుజ్జి, సృజన్, హరీశ్, తదితరులు పాల్గొన్నారు.