అక్షరటుడే, ఎల్లారెడ్డి: జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సదాశివనగర్‌ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి శివారులో గల ఎన్‌హెచ్‌-44 జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి ఓ యువకుడు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతిచెందినట్లు ఎస్సై రంజిత్‌ తెలిపారు.